బాల్ టాంపరింగ్ ఉదంతంపై సచిన్

244
Right decision has been taken says Sachin
- Advertisement -

బాల్ టాంపరింగ్ వివాదానికి పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్,డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేదం,కామెరాన్ బాన్ క్రాఫ్ట్‌పై 8 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ గాడ్ సచిన్ స్పందించారు.క్రికెట్ సమగ్రతను కాపాడేందుకు ఐసీసీ,క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం సరైందనేని అభిప్రాయపడ్డాడు.

క్రికెట్ నిజాయితీగా ఆడే ఆటని…అందుకే జెంటిల్‌ మన్‌ గేమ్ అనే గుర్తింపును తెచ్చుకుందన్నారు. సౌతాఫ్రికాలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమని తెలిపిన సచిన్…గెలవడం ముఖ్యమే అయినప్పటికీ, ఆ గెలుపు ఎలా సాధ్యమైందనేది అంతకంటే ముఖ్యమైన అంశమని తెలిపాడు.

మరోవైపు ఇప్పటికే ఏడాది నిషేదం ఎదుర్కొన్న స్మిత్,వార్నర్‌లు ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపీ వీరిదెబ్బకు ఆసీస్ జట్టుకు స్పాన్సర్లు వెనుదిరుగుతున్నారు. సీఏకు అతిపెద్ద స్పాన్సర్ అయిన ఫండ్ మేనేజర్ మాగెల్లాన్ తన కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఏఎస్ఐసీఎస్ కంపెనీ ప్రకటించింది. ఇతర స్పాన్సర్లు అయిన క్వాంటాస్ ఎయిర్‌లైన్స్, కామన్వెల్త్ బ్యాంకులు కూడా బాల్ ట్యాంపరింగ్‌కు వ్యతిరేకంగా గళమెత్తాయి.

- Advertisement -