బీరకాయతో ఆ సమస్యలు దూరం!

72
- Advertisement -

మన శరీర పోషణలో కూరగాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతిరోజు కూరగాయలు తినాలని ఆహార నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలు తినడానికి కొంతమంది ఆసక్తి చూపించరు అలాంటి కూరగాయలలో బీరకాయ ఒకటి. బీరకాయతో కర్రీ, వేపుడు, సాంబారు, వంటి రకరకాల వంటకాలు తయారు చేస్తుంటారు. కొంతమంది బీరకాయతో చేసిన వంటకాలు ఇష్టంగా తింటే.. మరికొందరికి మాత్రం పెద్దగా ఇష్టముండదు. కానీ బీరకాయ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టారు..

బీరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్ పొటాషియం వంటి పోషకాలు అంధికంగా ఉంటాయి. ఈ పోషకాలాన్ని కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారు తప్పనిసరిగా వారి యొక్క ఆహార డైట్ లో బీరకాయను చేర్చుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఐరన్ మెండుగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య దూరం కావడంతో పాటు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇంకా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బీరకాయ ఎంతో ఉపయోగ పడుతుంది.

ఇంకా ప్రతిరోజూ బీరకాయరసం తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని కొన్ని పరిశోదనల్లో వెల్లడైంది. ఎందుకంటే బీరకాయలో ఉండే విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం వంటివి ఇమ్యూనిటీ ఫవర్ పెంచడంలో సహాయ పడతాయి. ఇంక వంట్లో వేడితో బడపడే వారు తప్పనిసరిగా బీరకాయను తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఇందులో నీటిశాతం అధికంగా ఉండడంతో పాటు సోడియం, జింక్, రాగి, సెలీనియం వంటి ఖనిజాలు శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయ పడతాయి. ఇంకా బీరకాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు అల్సర్, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. దాంతో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో కూడా బీరకాయ ఎంతగానో ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:మహారాజకి అద్భుతమైన రెస్పాన్స్

- Advertisement -