ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజుకంటే ముందే రోజ్ డే, ప్రపోజ్ డే, చాకొలెట్ డే, టెడ్డీ డేలను జరుపుకుని ప్రేమికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి.
అయితే ప్రామిస్ డే సందర్భంగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రామిస్ చేశారు. వర్మ చేసిన ప్రామిస్‌కు అనూహ్య స్పందన వస్తోంది. అంతేకాదు వర్మ చేసిన ఆ ప్రామిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘నేను ప్రామిస్ ను నిలబెట్టుకోనని చెప్పేందుకు ‘ప్రామిస్’ చేస్తున్నా. ప్రామిస్ డే శుభాకాంక్షలు’ అని పేర్కొన్న వర్మ, ‘దేవుడి పైనా, మా అమ్మ పైనా ప్రామిస్ చేయడం కన్నా అమితాబ్ బచ్చన్, నాగార్జున, స్టీవెన్ స్పీల్ బర్గ్, దావూద్ ఇబ్రహీం, బ్రూస్ లీ, మియా మల్కోవాపై ప్రామిస్ చేస్తున్నా. ఈ ఏడాది బాధ్యత గల వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తా’ అంటూ ఆసక్తికర ట్వీట్ ను వర్మ చేశారు. కాగా..వర్మ ఈ రోజు ట్వట్టర్ ద్వారా చెప్పిన మాటను నిలబెట్టుకుంటారో లేదో వేచిచూద్దాం అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.