వర్మ ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ ట్రైలర్..

587
RGV's God, Sex and Truth Trailer
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఈ సారి ఏకంగా పోర్న్ స్టార్‌తో రంగంలోకి దిగారు. అమెరికాకు చెందిన మియా మల్కోవా అనే పోర్న్ స్టార్‌తో షార్ట్ ఫిల్మ్ తీస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అని పేరు పెట్టాడు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈరోజు విడుదలైన ఈ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ట్రైలర్ చూస్తుంటే.. ఇదేదో ఒక వర్మ మార్కు డాక్యుమెంటరీలా ఉంది. అయితే డాక్యుమెంటరీ అన్నాక రీసెర్చ్ అండ్ థీసిస్ చాలా ఉండాలి. కాని మనోడు మాత్రం.. ఆమెను నగ్నంగా చూపిస్తూ.. ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలు సెక్స్ గురించి చేసిన కామెంట్లను మధ్య మధ్యలో చూపిస్తూ.. మియా మల్కోవా చేత కొన్ని కామెంట్లు చేయించాడు. ”ఒక అమ్మాయి దేవుడు క్రియేట్ చేసిన సెక్స్ అనే ప్రక్రియను ఎంజాయ్ చేయడానికి.. మధ్యలో మానవుల అడ్డుకట్టు ఎందులకు? ఇకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనే ఎందుకు రతిని జరపాలి? ఒకేసారి తనకు నచ్చినట్లు చాలామందితో చేయొచ్చు కదా? వీటన్నింటికీ నాకు పోర్న్ ఇండస్ర్టీ దారి చూపించింది” అంటూ మియా మల్కోవా చాలా గొప్పగా చెప్పడం ఈ ట్రైలర్ లో ప్రధానాంశం.

అయితే సెక్స్ అనే విషయం గురించి ఏళ్ళతరబడి రీసెర్స్ చేసినవారికి కూడా రానంత పేరు ఇప్పుడు వర్మ ఇలా పోర్న్ స్టార్ తో పోర్న్ ను సపోర్టు చేస్తూ తీసిన వీడియోతో రావచ్చు. కాని ఈ తరహా డాక్యుమెంటరీలు పరిశోధనలూ వీడియోలు.. ఇప్పటికి కొన్ని వందలు వచ్చాయి. హాలీవుడ్ మరియు వరల్డ్ సినిమా చూసేవారికి ఇది అస్సలు కొత్తగా అనిపించదు. ఏ యాంగిల్లో చూసినా కూడా.. కొత్తగా అయితే ఉండదు.

https://youtu.be/gFLVToNKBgY

- Advertisement -