కేసీఆర్‌ బయోపిక్‌ టైటిల్ ప్రకటించిన వర్మ..

183
kcr

టాలీవుడ్‌లో‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’మూవీతో రాజకీయవర్గాల్లో వేడి పుట్టించిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.. ఈ వివాదాల దర్శకుడు మరో బయోపిక్‌కు తెర లేపాడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినిమా తీస్తానని చాలా రోజుల క్రితం ప్రకటించిన వర్మ అన్నట్లుగానే సినిమా టైటిల్‌ను ఈరోజు ప్రకటించారు. ‘కేసీఆర్ టైగర్.. ది అగ్రెసివ్ గాంధీ’ ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్‌ను జతచేశారు. ఈ సినిమాకు టైటిల్‌ను వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరో ట్వీట్‌లో.. ఇది కేటీఆర్‌ తండ్రి బయోపిక్‌.. అని, ఆంధ్రపాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు అణచివేతను తట్టుకోని కేసీఆర్‌ ప్రత్యేకరాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో అనే విషయాలను చిత్రంలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో నటీనటుల విషయమై త్వరలోనే వర్మ మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు.