ఆయన వల్లే నా కెరియర్‌కి బ్రేక్ వ‌చ్చింది..

296
- Advertisement -

హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్ కార్యక్రమం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది.

Hero Satya dev

ఈ సంద‌ర్భంగా హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ.. నా కెరియర్ బ్రేక్ ప్ర‌దీప్ తోనే వ‌చ్చింది. నా వీడియో ఎవ‌రో చూపిస్తే అది చూసి న‌న్ను ఆడిష‌న్స్ కోసం జ్యోతి ల‌క్ష్మి కి కాల్ చేసాడు. అలా నా కెరియ‌ర్ కి పెద్ద బ్రేక్ రావడానికి ప్ర‌దీప్ కార‌ణం. అత‌ని రుణం తీర్చుకోలేను. పెద్ద మాట‌లా అనిపించినా అది నిజం. ఇక ఈ సినిమా విష‌యంలో నేను హీరో గా చేస్తున్నాను అన‌గానే చాలా మంది వెన‌క్కులాగే ప్ర‌య‌త్నం చేసారు. కానీ నాతోనే ఈసినిమా చేయాల‌ని గ‌ట్టిగా ప‌ట్టుబట్టి చేసాడు. ప్ర‌దీప్ చేసే ప‌నిలో చాలా క్లారిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ అంటే నాకు ఇష్టం. ఈ రోజు వేదిక మీద మాట్లాడిన వారందరీ మాట‌లు వింటే నాకు క‌డుపు నిండిపోయింది. న‌న్ను ఇంత‌గా అభిమానిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సినిమా విష‌యంలో నేను చాలా న‌మ్మ‌కంగా ఉన్నాను. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వింటాను.

- Advertisement -