‘సైకిల్’ పంక్చరైంది..అందుకే ‘కారు’లో వచ్చా:వర్మ

358
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన వర్మ తనకు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదని,ప్రజా సేవ చేయనని తెలిపారు. చంద్రబాబు అసలు స్వరూపం బయట పడుతుందన్న భయంతో కొంతమంది ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

సైకిల్ టైరు పంక్చర్‌ అయింది. అందుకే కారులో వచ్చానని చమత్కరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేయాలనుకున్నప్పుడు సైకిల్‌ జోరు మీద ఉందని, ఇపుడు సైకిల్‌కు పంక్చర్‌ పడిందని ఎద్దేవా చేశారు. రైతులు కష్టాలు తనకు తెలియదని, తాను ఎప్పుడూ పొలం వెళ్ళలేదని స్పష్టం చేశారు. మహర్షి లాంటి సినిమాను మహేష్‌బాబు లేకుండా తీస్తే ఎవరు చూస్తారని ప్రశ్నించారు. ‘

ఓ వైపు కేసీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన వర్మ తన నెక్ట్స్ సినిమాను ప్ర‌క‌టించారు. `క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు` సినిమాను తీస్తున్నట్లు చెప్పారు. తాను ఇంకా క‌థ రాసుకోలేద‌ని.. ఇక‌పై రాయాల్సి ఉంద‌న్నారు. ఏపీలో వాయిదా పడిన `లక్ష్మీస్ ఎన్టీఆర్‌` ఈ నెల 31న విడుద‌ల కానుంది.

- Advertisement -