షూటింగ్‌లో గాయపడ్డ అభిషేక్..!

92
abhisheik

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ గాయపడ్డారు. ప్రస్తుతం అభిషేక్ బాబ్ విశ్వాస్ సినిమాలో నటిస్తుండగా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అభిషేక్ చేతికి ఫ్రాక్చర్ అయింది.దీంతో అభిషేక్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ప్రార్ధిస్తున్నారు.

ప్రస్తుతం అభిషేక్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అభిషేక్‌ని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

అభిషేక్ గాయపడ్డారని.. అయితే చిన్న గాయమని చెప్పారు ఆస్పత్రి డాక్టర్లు. చికిత్స అనంతరం అభిషేక్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోయాడని చెప్పారు.