RGV:కేసులకు భయపడేది లేదు

3
- Advertisement -

కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు.

ఏడాది క్రితం పెట్టిన ఏవో ట్వీట్స్​ వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని.. తాను ట్వీట్స్​ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్​లో ఉన్నానని.. నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు.

టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్, జనసేన నేత పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల రోజుల క్రితం మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైంది. విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

- Advertisement -