వర్మ ‘మర్డర్’ ఫస్ట్ లుక్..

467
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మ మరో కొత్త వివాదానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది.. వర్మ ఈమద్య కాలంలో వరసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా వర్మ మరో సినిమా అనౌన్స్ చేశాడు వర్మ. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘మర్డర్’ కుటుంబ కథా చిత్రమ్ అనే టైటిల్ పెట్టాడు వర్మ. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు.

ఇక మారుతీరావు కూతురు అమృత.. ప్రణయ్ అనే వ్యక్తిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడం వల్ల తన పరువు పోయిందని అల్లుడిని దారుణంగా హత్య చేయించాడు. అయితే ఇటీవల మారుతీరావు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇప్పుడు ఈ ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కించబోతున్నాడు.

ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు క్విటీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రధాన పాత్రలైన అమృత పాత్రలో సాహితి నటిస్తుండగా.. మారుతీరావుగా శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నాడు.

- Advertisement -