ఆర్జీవీ….పవర్ స్టార్ ఫస్ట్ లుక్.!

491
rgv powerstar
- Advertisement -

లాక్ డన్, కరోనా నేపథ్యంలో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే కరోనా, క్లైమాక్స్‌,నగ్నం,మర్డర్, నగ్నం వంటి సినిమాలను తెరకెక్కించిన ఆర్జీవీ క్లైమాక్స్, నగ్నం సినిమాలను శ్రేయాస్ ఈటీలో విడుదల చేశారు.

ఇటీవలె ’12 O క్లాక్’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన వర్మ….తాజాగా పవర్ స్టార్ మూవీ లుక్‌ని విడుదల చేశారు. పవర్ స్టార్‌….ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్న ఫోటోని రిలీజ్ చేశారు. పవర్ స్టార్ టైటిల్ మధ్యలో గాజు గ్లాసు (జనసేన పార్టీ గుర్తు) పెట్టి పలు అనుమానాలకు తెరలేపారు.

ఈ సినిమాను కూడా ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్(ఓటీటీ)లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు వర్మ. ఇక వర్మ రిలీజ్ చేసిన పవర్ స్టార్ లుక్‌ ఎన్ని కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతుందో వేచిచూడాలి.

- Advertisement -