గాంధీలో మెరుగైన వైద్యం: కరోనా రికవరీ పేషంట్

48
coronavirus

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా రోగులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా కొంతమంది కావాలనే డాక్టర్లు,గాంధీ ఆస్పత్రిపై దుష్ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందని తెలుసుకుని గాంధీ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న నరేంద్ర తన అనుభవాన్ని తెలిపాడు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో గాంధీలో చేరానని….7 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచారని నరేంద్ర వెల్లడించారు. తనకు చాలాబాగా ట్రీట్ మెంట్ చేశారని…ఫుడ్, నీట్ నెస్ అంతా బాగుందన్నారు. తనకు జింక్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఎక్కువగా ఇచ్చారని ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందిస్తూ జాగ్రత్తగా చూసుకున్నారని తెలిపారు. కరోనా వచ్చిందని భయానికి గురికావొద్దని…ధైర్యమే మనల్ని కాపాడుతుందన్నారు.

కరోనా వచ్చినా అత్యధిక శాతం ప్రజలు కొద్దిపాటి మందులు, చిట్కా వైద్యం తోనే కోలుకుంటున్నారు.ఎక్కడో వేలల్లో ఒక్క కేసు సీరియస్ అయ్యింది అని ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసే వారు ఇకనైనా కళ్లు తెరవాలని వీడియో చూసిన వారు పోస్ట్ చేస్తున్నారు.