- Advertisement -
కరోనా నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పై వరుస సినిమాలు విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా పవర్ స్టార్….ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్న ఫోటోని రిలీజ్ చేసి కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారారు.
ఇక తాజాగా పవర్ స్టార్ మూవీలో చంద్రబాబును ఇన్వాల్వ్ చేశాడు ఆర్జీవీ.అటు వైపు పవన్ పాత్రధారి కూర్చుని ఉండగా.. ఇటువైపు చంద్రబాబు గెటప్ లోని వ్యక్తి ఉన్నాడు . చంద్రబాబు తిడుతుంటే.. పవన్ ఏమీ పట్టనట్లు ఉన్న ఫొటోను వర్మ లేటెస్టుగా పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు ‘ఎ స్కోల్డింగ్ మూమెంట్ ఫ్రం ద పవర్ స్టార్’ అని క్యాప్షన్ పెట్టాడు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో చంద్రబాబు పాత్ర వేసిన నటుడితోనే ఈసారి కూడా ఆ పాత్రను చేయిస్తున్నాడు వర్మ.
- Advertisement -