నాగబాబుపై వర్మ సెటైర్‌..

240
rgv nagababu
- Advertisement -

గత కొంతకాలంగా నాగబాబు-బాలయ్య ఫ్యాన్స్‌ మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రచ్ఛన్నయుద్దం నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య ఎవరో అని తెలియదంటూ అగ్నికి ఆజ్యం పోసిన నాగబాబు తర్వాత వరుసగా తనమాటలను సమర్ధించుకుంటూనే పోస్టులు చేస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే నా బాధ
ఒక‌వైపు.. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌నే ఆనందం ఒక‌వైపు.. ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు.

నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం అని వ‌ర్మ ట్వీట్ చేశారు.మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్స్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో చిరంజీవి,పవన్‌ కల్యాణ్‌పై తనదైన శైలీలో విమర్శలు గుప్పించి మెగా ఫ్యాన్స్ ఆగ్రహనికి గురైయ్యారు. తాజాగా నాగబాబును కూడ వదలని వర్మ సెటైర్ వేసేశారు.

- Advertisement -