రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలతో వర్తలో నిలుస్తుంటారు. ప్రస్తుతం వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈసినిమా మొదటి నుంచి ఎదో ఒక వివాదాన్ని సృష్టించి పబ్లిసిటి చేసుకుంటున్నాడు వర్మ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలను ఆపీవేయాలంటూ ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కేసులు పెట్టారు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల విషయంలో కోర్టు లైన్ క్లియర్ చేసేసింది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆసక్తిర వాఖ్యలు చేశారు. ఇక్కడ వర్మ కేసీఆర్ బయోపిక్ ప్రస్తావన తీసుకురావడం విశేషం. ఆయన జీవితంలో చాలా డ్రామా ఉందని ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటం ముక్కుసూటిగా పోరాడే తత్వం ఇవన్ని కలగలిపితే ఓ దర్శకుడికి ఇంతకన్నా బయోపిక్ సరిపోయే కథ ఎక్కడ దోరురకుతుందని చెప్పాడు.
అయితే వర్మ అసలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సంగతి పూర్తిగా తేలకుండా వర్మ ఇలా కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడం విశేషం. ఒకవేళ ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు సినిమా విడుదలకు బ్రేకులు పడితే తెలంగాణాలోనైనా రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. ఇప్పుడు బయోపిక్ పేరుతో కేసీఆర్‌ను అదే పనిగా పొగుడుతుంటే అందరికీ అవే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాకముందే వర్మ కేసీఆర్ బయోపిక్‌పై మాట్లాడటం చర్చాంశనీయమైంది.
ఇక ఈ సినిమా చంద్రబాబుకి పూర్తి వ్యతిరేకమైనది వినిపిస్తోంది. ఇక ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల విషయంలో వర్మ.. బాబుపై స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని..కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని.. ఆయనే దగ్గరుండి సినిమా రిలీజ్ అయ్యేలా చూస్తారని కామెంట్ చేశాడు. చివర్లో జై చంద్రబాబు అంటూ తన మార్క్ పంచ్ వేశాడు వర్మ.