ఆర్జీవీ ఎమోషనల్‌..బాస్టర్డ్ ఆగం చేసిండు..!

432
rgv
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నట్లు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని దీనికి దిశ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు నిందితుల కుటుంబాల గురించి కూడా వివరాలు తెలుసుకోవడానికి నిందితుల్లో ఒకడైన చెన్న కేశవులు భార్య రేణుకను ఆదివారం కలిశారు ఆర్జీవీ.

ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఆర్జీవీ … దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు.. అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని మండిపడ్డారు. రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది, 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకుండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయిందని పేర్కొన్నాడు.

https://twitter.com/RGVzoomin/status/1223860309288353792/photo/1

- Advertisement -