ఎప్పుడు వివాదాస్పదలతో వార్తల్లో నిలుస్తుంటాడు రాం గోపాల్ వర్మ. తన మాటలతో.. వ్యాఖ్యలతో.. పోస్టులతో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తుంటారాయన. ఎప్పుడేం మాట్లాడతారో అర్థం కాని వర్మను విపరీతంగా అభిమానించే వారు ఎంతమంది ఉంటారో.. అంతే మంది ఆయన తీరును తప్పు బట్టేవారు కూడా ఉంటారు. ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడకు వర్మ వెతుక్కుంటూ వెళతాడు. ఆ విషయం మరో మారు రుజువైంది. రాంగోపాల్ వర్మ తాజాగా సంచలన ప్రకటన చేశారు.
ప్రముఖ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. సంజు చిత్రం తనని తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. ఇది పూర్తి అవాస్తవాలతో తీసిన చిత్రమన్నారు. సంజయ్ దత్ బయోపిక్‌ని వాస్తవాలతో మళ్ళీ తెరకెక్కిస్తానని ప్రకటన చేశాడు. వర్మ ప్రకటనతో బాలీవుడ్ లో దుమారం మొదలైంది. వర్మ ప్రకటనతో బాలీవుడ్‌లో దుమారం రేపింది. సంజు చిత్రంలో సంజయ్ దత్ ను మంచోడిగా చూపించారని వర్మ ఆరోపించారు.
సంజయ్ దత్ జీవితంలో డ్రగ్స్ కేసు, ముంబై పేలుళ్లు ఇలా అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. ముంబై పేలుళ్ల ఘటన సంజయ్ దత్ జీవితంపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ ఘటనని సంజు చిత్రంలో సరైన విధంగా చూపించలేదని వర్మ అన్నారు. కేవలం 1993 ముంబై పేలుళ్లు ఇంకా సంజయ్ దత్ నుంచి ఏకే 47 స్వాధీనం అంశాలపైనే చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ చెప్పినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి.
కాగా రాంగోపాల్ వర్మ ఇప్పటికే సంజయ్ దత్ జీవితంలోని చోటు చేసుకున్న వివాదాలపై పరిశోధన మొదలుపెట్టినట్టు తెలిసింది. సంజయ్ దత్ సన్నిహితులని అప్పటి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. మరి వర్మ తీయబోయే ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.