వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ పై అల్లు అరవింద్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. వర్మ ఓ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని అల్లు అరవింద్ మండిపడ్డారు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను గత కొంత కాలంగా సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని, కొన్ని పరిణామలు, సంఘటనలు చూశాక మాట్లాడక పోవడం మంచిది కాదనే ఉద్దేశ్యంతోనే మాట్లాడుతున్నానని అన్నారు. తాను మెగా ఫ్యామిలీకి పెద్దగా ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఇండస్ట్రీ మంచిపని చేయబోతోంది.పరిశ్రమలో రెండు రకాల పరిష్కారాలను ఆలోచించామన్నారు.
ఇండస్ట్రీలోని ప్రతి సంస్థ ఇంటర్నల్‌గా ఓ కమిటీ వేసుకోవాలని సూచించారు. లైంగిక వేధింపులపై కమిటీ వేయాలని నిర్ణయించామని, కమిటీలో 50శాతం ఎన్జీవోలు, 50శాతం సినీ పరిశ్రమ వారుంటారని అల్లు అరవింద్ స్పష్టం చేశారు.