కథువా ఘటనపై స్పందించిన బిగ్‌బీ అమితాబ్..

230
Amitabh Bachchan On Kathua Rape Case: I Feel Disgusted Even Talking About It
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా ఘటనపై తాజాగా స్పందించారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ఈ దారుణ ఘటనపై మాట్లాడటమే బాధాకరమన్నారు . రిషీకపూర్‌తో కలిసి తాను నటించిన ‘102 నాట్‌అవుట్‌’ మూవీ సాంగ్‌ లాంఛ్‌ కార్యక్రమం సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ ‘కథువా ఘటన అత్యంత హేయం..దీనిపై మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇది మాటలకందని ఘోర’మని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Amitabh Bachchan On Kathua Rape Case: I Feel Disgusted Even Talking About It

అమితాబ్‌ బేటీ బచావో..బేటీ పఢావో ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కథువా, సూరత్, ఉన్నావ్ అత్యాచార ఘటలనలపై ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్స్ స్పందిస్తూ ఇలాంటి దారుణ ఘటలను పునరావృతం కాకుండా నిందితులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బాధితులకు సరైన న్యాయం చేయాలని తెలిపారు. ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖలు స్పందిస్తున్నారు.

- Advertisement -