ఎన్టీఆర్ ఆచూకీ చెప్పండి..10 లక్షలు గెలవండి!

436
rgv ntr biopic
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. దసరాకు షూటింగ్ ప్రారంభం కానుండగా జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమాలో నటించేవారిని వెతికే పనిలో ఉన్న వర్మ…చంద్రబాబును పోలిన ఓ వ్యక్తి వీడియోని ట్వీట్టర్‌ ద్వారా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాదు ఈ వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి లక్ష నజరాన ఇస్తానని ప్రకటించారు.

తాజాగా ఎన్టీఆర్ ఆచూకీ చెబితే భారీ నజరానా ఇస్తానని ప్రకటించారు వర్మ. ఇప్పటికే ఎన్టీఆర్ పాత్ర కోసం ముగ్గురు షార్ట్ లిస్ట్ అయ్యారని కానీ ఇంకా బెటర్ పర్సన్‌ కావాలని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌ను పొలి,మాట్లాడగలిగే వారి ఆచూకీ చెబితే పది లక్షలు ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు.

ఆర్జీవీ వెతుకుతున్న చంద్రబాబును పోలీన వ్యక్తి ఆచూకీని పంపించారు రోహిత్ అనే వ్యక్తి. ఈ విషయాన్ని ధృవీకరించారు ఆర్జీవీ. హే రోహిత్, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా యూనిట్‌కు సీబీఎన్‌(చంద్రబాబు)ను బహుకరించినందుకు కృతజ్ఞతలు. సినిమా ప్రారంభంలో తెరపైకి నీ పేరు వేసి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నీ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపించు లక్ష రూపాయల బహుమతి కోసం అని పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -