ఇండియన్ సినిమా ఇక ‘బీబీ’ అండ్ ‘ఏబీ’

232
RGV Does It Again,
- Advertisement -

బాహుబలి ది కన్ క్లూజన్ ఉత్కంఠకు తెరపడిన సంగతి తెలిసిందే. బాహుబలి మానియాతో ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్ధాయిలో నిలబెట్టిన సినిమాగా కొనియాడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు బాహుబలిపై ప్రశంసల వర్షం కురిపించగా తాజాగా ఆ జాబితాలో వివాదస్పద దర్శకుడు వర్మ చేరాడు.

తొలి రోజునే మెగా డైనోసార్ సత్తా చాటిందని, అందరు ఖాన్ లు, రోషన్ లు, చోప్రాల కన్నా తానే గొప్పని రాజమౌళి నిరూపించారని, అతన్ని కనుగొన్నందుకు కరణ్ జొహార్ కు తన సెల్యూట్ అని చెప్పాడు. రాజమౌళి వంటి వజ్రాన్ని గుర్తించిన కరణ్ జొహార్ తెలివి తేటలకు ‘బాహుబలి’ని ఇష్టపడే భారతీయులు పాదాభివందనం చేయాలని అన్నాడు. ప్రపంచం బీసీ అండ్ ఏడీ (క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం)లా భారత సినిమా ఇక ‘బీబీ అండ్ ఏబీ’ (బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి)గా మారనుందని అభిప్రాయపడ్డాడు. బాలీవుడ్ లోని ప్రతి సూపర్ స్టార్, ప్రతి సూపర్ డైరెక్టర్ ‘బాహుబలి 2’ ప్రభంజనంతో వణికిపోతున్నారని అన్నాడు.

సినిమా విడుదలకు ముందు కూడా వర్మ ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి-2వ భాగం విడుదలైన తరువాత, దేశంలోని చిత్ర నిర్మాతలు, దర్శకులందరూ తామంతా టీవీ సీరియల్ నిర్మాతలము, దర్శకులమేనని భావించాల్సి వస్తుందని అన్నాడు.

varma

- Advertisement -