ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ మరో ఆసక్తికర ట్వీట్.. ‌

62
- Advertisement -

దేశంలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి ఎన్నికల రేసులో నిలిచారు ఆమె ద్రౌపది ముర్ము. ఆమెపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. “ద్రౌపది సరే… పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు?” అంటూ తనదైన శైలిలో స్పందించారు. దాంతో భగ్గుమన్న బీజేపీ నేతలు వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చిన వర్మ… మరోసారి ద్రౌపది ముర్ముపై తాజా ఆసకక్తికర ట్వీట్ చేశాడు.

“గౌరవనీయులైన ద్రౌపది జీపై నేను చేసిన విస్తృతమైన పరిశోధన మరియు ఆమె కళ్ల తీవ్రత… ఆమె చిరునవ్వు అలాగే ముఖ రూపురేఖలు.. రెండింటి లోతుల్లోని సూక్ష్మ నైపుణ్యాలను అధ్యయనం చేయడం ద్వారా, ఆమె ప్రపంచం మొత్తంలో ఎప్పటికీ గొప్ప రాష్ట్రపతి అవుతారనడంలో నాకు సందేహం లేదు.. బీజేపీ కి నా ధన్యవాదాలు”..‌ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -