జూన్ 6న వర్మ ‘క్లైమాక్స్’..

296
Climax
- Advertisement -

సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ద్వారా అలజడి సృష్టించిన ఆయన.. ఇక ఈ మూవీ ట్రైలర్, రిలీజ్ డేట్, సినిమా చూడటానికి కావాల్సిన సొమ్ము ఎంతో చెబుతూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు వర్మ.

‘క్లైమాక్స్’ సినిమాను ఓటీటీ వేదికపై RGVWorldTheatreలో విడుద‌ల చేస్తా అన్న వ‌ర్మ తాజాగా కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాడు. ”మియా మాల్కోవా ‘క్లైమాక్స్’ మూవీ జూన్ 6వ తేదీన రాత్రి 9 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీని RGVWorld.in/ShreyasET వేదికపై చూడొచ్చు. పే ఫర్ వ్యూ మోడల్‌లో ఈ సినిమాను మీ ముందుకు తెస్తున్నా. ఒక్కో వ్యూ కోసం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తా అని త‌న ట్వీట్ ద్వారా ప్ర‌క‌టించారు వర్మ.

కాగా శనివారం (మే 30) సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు వర్మ తెలిపాడు. ఇదిలావుంటే మరోవైపు వ‌ర్మ క‌రోనా వైర‌స్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ నుండి ఇటీవ‌ల ట్రైల‌ర్‌ కూడా విడుద‌ల చేశారు.

- Advertisement -