RGV:తలకోన..పెద్ద విజయం సాధించాలి

48
- Advertisement -

అక్షర క్రియేషన్‌ పతాకంపై శ్రీమతి స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో, నగేష్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా , అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘తలకోన’ నవంబర్‌ రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ, నటుడు శివాజీరాజా ప్రముఖ నిర్మాత రామారావు విచ్చేసి పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ…నాకు అందమంటే మహా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి అందమైన అడవిలో అందమైన అప్సర రాణి డాన్స్‌లు చేస్తూ.. ఫైట్స్‌ చేస్తుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ…తలకోన అడవిలో నేను కూడా కొన్ని సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే చాలా చాలా కష్టం ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి షూటింగ్‌ పూర్తి చేశారు అంటేనే యూనిట్‌ సంకల్పం అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలి అన్నారు.

Also Read:Bigg Boss 7 Telugu:అంతా అమర్ చుట్టే

- Advertisement -