- Advertisement -
కాశ్మీర్ లో హిందువులపై, కాశ్మీర్ పండిట్లపై 1980-90 దశకంలో జరిగిన మారణకాండని ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. మార్చ్ 11న దేశ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాగా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు సినిమాపై ప్రశంసలు గుప్పించగా తాజాగా ఆర్జీవీ సైతం స్పందించారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాతో పేలుడు పదార్థాలు కంటే అధికంగా ఫైర్ అయ్యారు. ఈ సినిమాతో బాలీవుడ్ ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్ ని స్థాపించినట్టేనని తెలిపారు.
ఈ సినిమాతో కొత్త సినిమా దర్శక నిర్మాతలకి స్ఫూర్తిగా నిలిచాడు వివేక్. ‘ది కశ్మీర్ ఫైల్స్’ కమర్షియల్ సక్సెస్ ని పక్కన పెడితే అంతకంటే కూడా భారీ విజయం సాధించింది” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
- Advertisement -