Rewind 2024: మూడోసారి విజయం ఎన్డీయే కూటమిదే

10
- Advertisement -

2024వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది.ఇక ఈ సంవత్సరం రాజకీయంగా,క్రీడా, అంతరిక్ష రంగంలో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నారు. ప్రధానంగా ఏప్రిల్-మేలో భారత సార్వత్రిక ఎన్నికల సమరం జరుగగా మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీయే కూటమి. అయితే గత రెండు సార్లు తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని దక్కించుకోగా ఈ సారి మిత్రపక్షాల సాయం తప్పనిసరైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌, బీహార్ ఎన్డీయే కూటమిలో కీలకంగా మారాయి.

ఇక గత రెండు సార్లు ప్రతిపక్ష హోద కొల్పోయిన కాంగ్రెస్‌కు కాస్త ఊరట కలిగించే అంశం ఏంటంటే ఈ సారి ఆ హోదా దక్కింది. ఎంపీ రాహుల్ గాంధీని ఇండియా కూటమి నేతలు ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ.

ఈ సంవత్సరం ఏడు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జమ్మూ మరియు కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర ,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక జమ్మూ కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగగా ఇండియా కూటమిని విజయం వరించింది.

రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇబ్బంది పెట్టిన అంశం. లిక్కర్ స్కాం ఈ కేసులో ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, మాజీ సీఎం కేజ్రీవాలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం జైలుపాలయ్యారు. అయోధ్య రామాలయం నిర్మాణాన్ని చేపట్టింది కేంద్రం. దేశంలోని ప్రతీ గ్రామానికి అయోధ్య రామాలయం అక్షింతలు పంపిణీ చేపట్టింది. పారిస్ పారాలింపిక్స్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్‌ ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది.

నువ్వానేనా అన్నట్లు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. రష్యా – ఉక్రెయిన్ వార్ ఈ సంవత్సానికే హైలైట్‌గా నిలిచింది. కొన్ని నెలల పాటు యుద్దం జరిగిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ -19 మహమ్మారి నీడలో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌తో పోల్చితే 2024 ఒలింపిక్స్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగాయి. ఇస్రో పలు ప్రయోగాలు చేపట్టి విజయవంతంగా ప్రయోగించింది.

Also Read:Pushpa 2: ఏపీ ప్రభుత్వానికి బన్నీ థ్యాంక్స్

- Advertisement -