రాధ‌: రివ్యూ

292
Review : Radha
Review : Radha
- Advertisement -

సినిమా సినిమాకీ తన పరిధిని పెంచుకొంటూ ‘శతమానం భవతి’ చిత్రంతో కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందుకున్న యంగ్ హీరో శర్వానంద్ చేసిన మరొక చిత్రం ‘రాధ’. నూతన దర్శకుడు చంద్ర మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:
చిన్న‌ప్పుడే పోలీసు కావాల‌ని నిర్ణ‌యించుకొంటాడు రాధాకృష్ణ (శ‌ర్వానంద్‌). పోలీసు కాక ముందే పోలీసులు చేయాల్సిన ప‌నుల‌న్నీ చేసేస్తుంటాడు. ఒక‌సారి కర‌డుగట్టిన నేర‌గాళ్ల‌ని ప‌ట్టిస్తే.. సాక్షాత్తూ డీజీపీనే రాధాకృష్ణ‌ని పిలిచి పోలీసు ఉద్యోగం ఇస్తాడు. అప్ప‌ట్నుంచి దుష్ట శిక్ష‌ణ విష‌యంలో మ‌రింత‌గా చెల‌రేగిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. ఒక పల్లెటూరిలో పోస్టింగ్ కు వెళతాడు. అలా డ్యూటీ మీద ఆ ఊరికి వెళ్లిన రాధాకృష్ణ అదే ఊరిలో ఉండే రాధ (లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు.

ఇంతలోనే అతనికి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా హైదరాబాద్ వచ్చిన అతనికి లోకల్ గా ఉండే పొలిటీషియన్ చేసిన దుర్మార్గాలు, పోలీస్ డిపార్ట్మెంట్ కు తలపెట్టిన ద్రోహం తెలిసి ఎలాగైనా అతన్ని నాశనం చేయాలని ఫిక్సవుతాడు. అసలు ఆ పొలిటీషియన్ చేసిన తప్పులేంటి ? అతన్ని రాధ ఎలా దెబ్బకొట్టాడు ? ఈ మధ్యలో రాధ ప్రేమ కథ ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
పక్కా కమర్షియల్ ఫార్ములాని అనుసరించి ఈ సినిమాను రూపొందించడమే ఈ సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్. ఇక హీరో శర్వానంద్ పోలీసాఫీసర్ అవ్వాలనే అతి తపన ఉన్న కుర్రాడిగా పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఆయ‌న పోలీసు పాత్ర‌లో చేసే సంద‌డి ప్రేక్ష‌కులకు కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. లావ‌ణ్య త్రిపాఠి అందంగా క‌నిపించింది.కానిస్టేబుల్ షకలక శంకర్ తో కలిసి కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు శ‌ర్వానంద్.

సెకండాఫ్ సినిమా అంతా హీరో, విలన్ ల మధ్యే నడిచే సీరియస్, కామెడీ సన్నివేశాలు, వాటి మధ్యలో హీరో – హీరోయిన్లతో కూడిన కొన్ని ఫన్నీ రొమాంటిక్ సన్నివేశాలతో నిండి సరదాగా సాగింది. విలన్ గా చేసిన రవి కిషన్ తన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్ బాగానే ఉన్నా.. హీరోపై రన్ చేసిన సీన్లు కాస్త బోర్ అనిపించాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ చివరికి గాని సినిమా అసలు కథలోకి వెళ్ళకపోవడం తో ఫస్టాఫ్ చాలా వరకు నీరసంగానే ఉండి రన్ టైమ్ కోసమే రూపొందించినట్టుంది.
కథలోకి అసలు ట్విస్ట్ ఒకసారి తెలిసిపోయాక ఇకపై జరిగే ప్రతి సన్నివేశాన్ని చాలా సులభంగా ఊహించేయవచ్చు. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు ఏమంత గొప్పగా ఆకట్టుకోలేకపోయాయి. అలాగే సెకండాఫ్లో హీరో విలన్ల మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడూ హీరోదే పై చేయి అవడంతో కథనంలో దమ్ము తగ్గింది.

సాంకేతిక విభాగం:
అన్ని కమర్షియల్ హంగులతో రొటీన్ ఎంటర్టైనర్ గా సాగే కథను సిద్ధం చేసుకున్నారు ద‌ర్శ‌కుడు. రాధన్ సంగీతం కమర్షియల్ సినిమాల స్థాయికి తగ్గట్టు లేకుండా సాదాసీదాగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
సినిమా కథ అన్ని వాణిజ్య చిత్రాల్లానే రొటీన్ గానే ఉన్నా అక్కడక్కడా మంచి ఫన్, శర్వానంద్ పెర్ఫార్మెన్స్, సెకండాఫ్ లో కనిపించే ఎమోషన్ ఆకట్టుకునే అంశాలుఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే రొటీన్ కమర్షియల్ ఎంటరటైనర్లను ఇష్టపడే ప్రేక్షకులను ‘రాధ’ మెప్పిస్తాడు.

విడుదల తేదీ : మే 12, 2017
రేటింగ్ : 3/5
నటీనటులు : శర్వానంద్, లావణ్య త్రిపాఠి
నిర్మాత : భోగవల్లి బాపినీడు
సంగీతం : రాధన్
దర్శకత్వం : చంద్ర మోహన్

- Advertisement -