ఆగస్టులో…. అజిత్ ‘వివేగమ్‌’

319
Vivegam Teaser
- Advertisement -

అజిత్‌ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వివేగమ్‌’ టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో అజిత్‌ స్పైగా ఆకట్టుకుంటున్నాడు. ‘ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నిన్నేవడూ ఓడించలేదు. సాధించేవరకు వదిలిపెట్టకు’ అంటూ టీజర్‌లో అజిత్‌ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ విడుదలైన 24 గంటల్లోనే 1.8 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటివరకు 4 మిలియన్ వ్యూస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం వివేగం టీజర్ హ్యష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ టీజర్ పై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఈ చిత్ర టీజర్ మానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అజిత్ కాసేపు ఆర్మీ ఆఫసీర్‌గా.. మరికాసేపు మోస్ట్ వాంటేడ్ క్రిమినల్‌గా కనిపిస్తోన్న ఈ టీజర్ చూస్తుంటే.. సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేశాడేమో అనిపిస్తోంది. ఎక్కువభాగం ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ యాక్షన్ సినిమాలను మరపించేలా ఉంది. నెవర్ గివ్ అప్ అనే మోటోతో అజిత్ చెప్పిన డైలాగ్స్.. టీజర్‌కు హైలెట్…. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు టీజర్ చివర్లో రివీల్ చేశారు..

శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వివేగం చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుందని అంటున్నారు. సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ తొలిసారిగా అజిత్‌తో రొమాన్స్‌ చేస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నాడు. రూ.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.

- Advertisement -