కొత్తగా వచ్చే డిమాండ్లను పట్టించుకోవద్దు…

198
- Advertisement -

తెలంగాణలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయిందని.. ఇక పరిపాలనపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కొత్త డిమాండ్లు, వినతులను ఇక పరిగణనలోకి తీసుకునేది లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన అధికారులు… ప్రక్రియ సాఫీగా సాగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పునర్‌వ్యవస్థీకరణలో మార్పులు, చేర్పులకు ఏమాత్రం అవకాశం లేదని… కొత్త వినతులు వచ్చినా పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించారు. సుమారు ఏడాది పాటు వివిధ స్థాయిలో లోతుగా కసరత్తు చేసిన తరువాత, ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే తుది నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఫలితంగా జిల్లాలు, డివిజన్లు, మండలాలతో పాటు కొత్త కార్యాలయాల కూర్పు అద్భుతంగా జరిగిందని… ఇక పరిపాలనపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు.

- Advertisement -