జూన్‌ 3 నుండి ఆటో డ్రైవర్లలకు వ్యాక్సిన్‌: మంత్రి హరీష్

232
- Advertisement -

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్ లు,టాక్సీ డ్రైవర్ లకు వ్యాక్సినేషన్‌పై సోమవారం మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెల 3వ తేదీ నుండి క్యాబ్ డ్రైవర్స్ ,టాక్సీ డ్రైవర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. రోజుకు 10 వేల మందికి వ్యాక్సినేషన్ పక్రియ జరగనుంది. ఒకవేల కరోనా 3వ వేవ్ వచ్చినా అందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉండాలి అని మంత్రి సూచించారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

- Advertisement -