రివ్యూ : ఓం నమో వేంకటేశాయ

332
Review : Om Namo Venkatesaya
- Advertisement -

భక్తిరస చిత్రాలకు కేరాఫ్‌ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో  అన్నమయ్య,శ్రీరామదాసు,శిరిడిసాయి లాంటి ఆబాల గోపాలాన్ని అందించిన రాఘవేంద్రరావు మరో అపూర్వసృష్టి ఓం నమో వేంకటేశాయ. వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ మరోసారి మ్యాజిక్ చేసిందా..? నాగ్ మరోసారి పరమ భక్తుడిగా ఆకట్టుకున్నాడా..? అన్నమయ్యగా ఒదిగిపోయిన నాగ్ హథీరాం బాబాగా ఎలా నటించాడో చూద్దాం … .?

కథ :
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ(నాగార్జున) చిన్నతనం నుంచి దేవుణ్ని చూడాలనే కోరికతోనే పెరుగుతాడు. వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్‌) చెప్పిన మాటతో కఠోర తపస్సు చేస్తాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ సదా  ఆయన ఆరాధనలో మునిగిపోతాడు. అలా ఏళ్లు గడిచిపోతాయి.  ఈ క్రమంలో టీటీడీ అధికారి రామపై కక్ష గడతాడు. అసలు రామపై అధికారి గోవిందరాజులు కక్ష గట్టడానికి కారణం ఏంటీ..?రామకి స్వామి దర్శన భాగ్యం కలిగిందా..? రామ …హథీరాం బాబాగా ఎలా మారడన్నదే మిగితా కథ.

Review : Om Namo Venkatesaya

ప్లస్ పాయింట్స్‌:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,కథనం, నటీనటులు, సంగీతం, క్లైమాక్స్.అన్నమయ్య, శ్రీరామదాసుతో మెప్పించిన నాగ్‌ హథీరాం బాబా పాత్రలో ఒదిగిపోయారు. పాత్రకు ప్రాణం పోశారు. భక్తుడిలా తాను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలెరన్న స్ధాయిలో నటించి అలరించాడు నాగ్. బుల్లితెర మీద ఇప్పటికే దేవుడిగా కనిపిస్తున్న సౌరభ్ జైన్, వెండితెర మీద మరింత అందంగా కనిపించాడు.  కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి. క్లైమాక్స్ సినిమాకే హైలైట్‌.

మైనస్ పాయింట్స్:

ఫస్టా ఫ్‌లో సగభాగం డ్రామా లేకపోవడం చిత్రానికి మైనస్‌. మరో మేజర్ మైనస్ పాయింట్ కృష్ణమ్మ (అనుష్క) ఎపిసోడ్. భక్తురాలిగా ఆమె ప్రస్తుతం బాగున్నా గతం అంత బలంగా లేదు. అలాగే ఫస్టాఫ్ లో రావు రమేష్ పాత్ర చుట్టూ అల్లిన కొన్ని సన్నివేశాల నైపథ్యం అంతే అయినా వాటిని చూపిన విధానం పాతదే కావడం నిరుత్సాహపరించింది. ఇక కథకు ప్రభాకర్ ధరించిన మాంత్రికుడి పాత్ర అవసరం సరైనదే అయినా దాన్ని అంత హడావుడిగా తేల్చేయడం మింగుడు పడలేదు.

Review : Om Namo Venkatesaya

సాంకేతిక నిపుణులు :

సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. చరిత్రలో హాథీరాంకు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.. ఉన్న కొద్ది పాటి సమాచారంతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు.దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన మేజిక్‌ను ప్రదర్శించారు. రాఘవేంద్రుడి ఆలోచనలను మరింత అందంగా తెరమీద ఆవిష్కరించాడు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి. ముఖ్యంగా వందల ఏళ్లనాడు తిరుమల గిరులు ఎలా ఉండేవో.. ఎంత పచ్చదనం ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. నేపథ్య సంగీతం కథను మరింత గుండెకు హత్తుకునేలా మార్చింది. కిరణ్‌కుమార్‌ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

ఓం నమో వేంకటేశాయతో దర్శకేంద్రుడు మరోసారి ప్రేక్షకుల్లో భక్తిభావాన్ని తట్టిలేపారు.  కథ, కథనం, నాగార్జున, క్లైమాక్స్ సన్నివేశాలు ప్లస్ పాయింట్ కాగా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు, సెకండాఫ్‌లో అనుష్క ఎపిసోడ్‌ మైనస్ పాయింట్స్‌. మొత్తంగా ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలనిపించే భక్తి ప్రవాహం చిత్రం  ఓం నమో వేంకటేశాయ.

విడుదల తేదీ:10/02/2017
రేటింగ్ : 3.5/5
నటీనటులు:నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి
దర్శకత్వం : కే.రాఘవేంద్రరావు

- Advertisement -