ఆ చిత్రం పై చిరు ప్రశంసల వర్షం..!

203
Chiranjeevi talk about Nagarjuna and Om Namo Venkatesaya movie
- Advertisement -

భక్తిరస చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాధించుకున్న హీరో కింగ్‌ నాగార్జున. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘షిర్డీసాయి’ లాంటి భక్తిరస చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు నాగ్‌.  అదే క్రమంలో ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో తెరకెక్కిన భక్తిరస చిత్రం నేడు పెద్ద ఎత్తున విడుదలవుతోన్న విషయం తెలిసిందే.

మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున వెంకటేశ్వర స్వామి భక్తుడు హతిరామ్ బాబా పాత్రలో నటించారు.
కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాపై అన్నిచోట్లా మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా పై మెగాస్టార్ చిరు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా నిన్న రాత్రి హైద్రాబాద్‌లోని సినీ మ్యాక్స్‌లో కొందరు ప్రముఖులకు ‘ఓం నమో వెంకటేశాయ’ స్పెషల్ షో వేశారు.

ఈ సినిమాను వీక్షించిన చిరంజీవి తన అభిప్రాయాల్ని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటి సినిమా అని,  కొన్ని సన్నివేశాలకు కంటతడి పెడుతూనే ఉన్నా.. ఇలాంటి సినిమాలు చేయాలంటే  నాగార్జునకు మాత్రమే సాధ్యమని చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం కూడా దర్శకుడు రాఘవేంద్రరావు గారికే సాధ్యమంటూ చిరంజీవి వారితో పాటు ఓం నమో వెంకటేశాయపై కూడా ప్రశంసలు కురిపించారు.

- Advertisement -