రివ్యూ : కన్నుల్లో నీ రూపమే…

306
kannullo nee rupame
- Advertisement -

ఏఎస్పీ క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నుల్లో నీ రూపమే. నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. హీరోగా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందు వచ్చిన నందు ప్రేమకథ ఎలా ఉంది..?హీరోగా హిట్ కొట్టాడా లేదా చూద్దాం…

కథ:

స‌న్నీ (నందు) తొలిచూపులోనే సృష్టి (తేజస్విని ప్ర‌కాష్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. తేజ‌స్విని కూడా సన్నీని ప్రేమిస్తుంది. అయితే త‌న ప్రేమ‌ని సోద‌రుడు ఒప్పుకుంటాడో లేదో అనే భ‌యం సృష్టిని వెంటాడుతుంటుంది. అయితే వీరిద్దరు అందరిని ఎదిరించి పెళ్లి చేసుకోవాడానికి సిద్ధమవుతుండగా సన్నీ చనిపోయాడానే విషయం తెలుస్తుంది. అసలు సన్నీ ఎలా చనిపోతాడు.? చనిపోయిన వ్యక్తి సృష్టికి ఎలా కనిపిస్తాడు..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కాన్సెప్ట్,సినిమాటోగ్రఫీ,నందు,తేజస్విని. హీరోగా నందు తన అద్భుతనటనతో కట్టిపడేశాడు. ప్రేమ సన్నివేశాల్లో,కీలక సన్నివేశాల్లో భావోద్వేగాలను చక్కగా ప్రదర్శించాడు. హీరోయిన్ తేజస్విని తన అందంతో ఆకట్టకుంది. ముఖ్యంగా నందు,తేజస్విని కెమిస్ట్రీ బాగుంది.పోసాని తన నటనతో సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేయగా, కమెడియన్ సాయి
నవ్వులు పూయించారు. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

 kannullo nee roopame

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ,కామెడీ లేకపోవడం,సాగదీసే సన్నివేశాలు. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ పర్వాలేదనిపించినా దాని చుట్టూ సరైన సన్నివేశాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. ప్రేమ‌క‌థ‌లో ఉండాల్సిన ఫీల్ మిస్స‌యింది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్లుగా సాగుతుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సుభాష్ దొంతి తన కెమెరా పనితనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సంగీత దర్శకుడు సాకేత్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాత భాస్కర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్న దర్శకుడు దానిని తెరమీద అందంగా చూపించడంలో విఫలమయ్యాడు.

తీర్పు:

నందు,తేజస్విని ప్రధానపాత్రల్లో బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కన్నుల్లో నీ రూపమే. కాన్సెప్ట్,నందు,తేజస్విని నటన సినిమాకు ప్లస్ కాగా కథ,కామెడీ లేకపోవడం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా సగటు ప్రేక్షకుడిని నిరాశపర్చే మూవీ కన్నుల్లో నీ రూపమే.

విడుదల తేదీ : 29/06/2018
రేటింగ్ : 2/5
నటీనటులు : నందు, తేజస్విని
నిర్మాత : భాస్కర్ భాసాని
సంగీతం : సాకేత్ కోమండురి
దర్శకత్వం : బిక్స్ ఇరుసడ్ల

- Advertisement -