ఇస్మార్ట్ శంకర్… ఫస్ట్ రివ్యూ

457
hero ram
- Advertisement -

ఎనర్జిటిక్ హీరో రామ్‌-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్‌. పూర్తి మాస్‌ ఎలిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. టీజర్‌,ట్రైలర్‌,ఫస్ట్ లుక్‌తో అంచనాలను పెంచేయగా సినిమాపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు హీరో రామ్‌.

ఇప్పుడే ఇస్మార్ట్ శంకర్సినిమా చూశా.. దీనమ్మా కిక్కూ…సినిమా చేస్తున్నప్పుడు….. స్క్రీన్‌పై చూసుకున్నప్పడు వచ్చిన కిక్కే వేరప్పా అంటూ ట్వీట్ చేశారు రామ్‌. ఇలాంటి కిక్ ఇచ్చిన సినిమా చేసి చాలా రోజులైంది. థాంక్స్ పూరీ జగన్నాథ్ అంటూ హైవోల్టేజ్ రివ్యూ ఇచ్చారు.

రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించగా ఇప్పటివరకు ఎప్పుడు చూడని మాస్‌ లుక్‌లో అదరగొట్టాడు రామ్‌. టూరింగ్‌ టాకీస్‌, పూరి కనక్ట్‌ పతాకాలపై పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

- Advertisement -