సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్

505
singaredni
- Advertisement -

సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సిరుల గనికిగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలకు దీటుగా నిలిచింది. ప్రధానంగా అమ్మకాలు, లాభాల్లో సింగరేణి చరిత్రలోనే అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరుల స్థలాలను రెగ్యులరైజ్​ చేసేందుకు అనుమతిచ్చింది.

వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుండగా వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది సర్కార్‌. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్‌‌ కంపెనీ లిమిటెడ్‌‌(ఎస్‌‌సీసీఎల్‌‌) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి దశాబ్దాల నుంచి సింగరేణి భూముల్లో కార్మికులు ఇళ్లు కట్టుకొని జీవిస్తున్నారు.

అయితే ఆ స్థలాలకు పట్టాలు లేక ఇబ్బందులు పడుతుండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు వారి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు విధించింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -