రివ్యూ : డోర

320
Review : Dora
- Advertisement -

ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రం డోర. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మించిన ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహించారు. గ్లామర్ రోల్స్ తగ్గించి కథాపరంగా సినిమాలే చేస్తున్న ఈ లేడీ సూపర్ స్టార్ టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో నయన్ ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం..

Review : Dora

కథ :

పారిజాతం (న‌య‌న‌తార‌) తండ్రికి గారాల‌ప‌ట్టి. ఓ సారి త‌న మేన‌త్త ఇంటికి తండ్రితో క‌లిసి వెళ్తుంది. అక్క‌డ తండ్రీకూతుర్ల‌కు అవ‌మానం జ‌రుగుతుంది. స్వ‌త‌హాగా ఛాలెంజ్ చేసే మ‌న‌స్త‌త్వం ఉన్న అమ్మాయి కావ‌డంతో తాను కూడా ఓ కాల్‌ట్యాక్సీ సంస్థను స్థాపించి, త‌న అత్త‌మామ‌ల‌ను మించిపోతాన‌ని శ‌ప‌థం చేస్తుంది. ఇంట్లో ఉన్న చిల్ల‌రంతా కూడ‌దీసుకుని ఓ పాత కారు కొంటుంది. అప్పటినుంచే ఆమెకు సమస్యలు మొదలవుతాయి. ఆ సమస్యలు ఏంటి..?అసలు కారులో ఏముంది..?పారిజాతానికి డోరకి పరిచయం ఎలా ఏర్పడుతుంది..?చివరికి కథ ఎలా సుఖాంతమైందనేదే..?  తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నయన్ నటన. తండ్రి గారాల పట్టిగా, పగ సాధించేవరకు విశ్రమించని మహిళగా నయన్ నటన ఆకట్టుకుంది.  సినిమా మొత్తం చాలా డీసెంట్ గా, గ్లామరస్ గా కనిపిస్తూ ఆమె ప్రదర్శించిన నటన చాలా బాగుంది. ఆరంభం నుండి చివరి దాకా సినిమాని తన భుజాలమీదే మోసింది నయన్. ఇక కథ విషయానికొస్తే టైటిల్ పోస్టర్ చూడగానే ఇదొక కారులో దూరిన ఆత్మ కథ అని ఇట్టే అర్ధమయినా కూడా ఆ ఆత్మ ఎవరిదనే చిన్న విషయం మంచి థ్రిల్ ను ఇస్తుంది. అలాగే సెకండాఫ్లో రివీల్ అయ్యే ఆ ఆత్మ కథ కూడా కాస్త ఎమోషనల్ గా కనెక్టవడమే కాక రీజనబుల్ గా కూడా అనిపిస్తుంది. రెగ్యులర్ హరర్ చిత్రాల్లోలాగా వికృతాకారాలను చూపించలేదు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ కొత్తగాలేని కథ,కథనం. ఎక్కడా సినిమాలో ఉత్కంఠత కనిపించలేదు. ఫస్టాఫ్ బోర్ కొడుతోంది.లొకేషన్ల పరంగానూ, విజువల్స్‌ పరంగానూ చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. నయనతారకు, వాళ్ళ నాన్నకు మధ్య నడిచే అనవసరమైన సీన్లు, కారు పై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు చాలా విసుగుపుట్టించాయి. ఒకే అంశాన్ని వేరు వేరు సన్నివేశాలతో మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నారనే భావన కలిగింది.  ఆత్మకు సంబందించిన సినిమా కాబట్టి ప్రేక్షకుడు సాధారణంగానే కాస్త హార్రర్ కంటెంట్ ను ఆశిస్తాడు. కానీ ఇందులో అలాంటివేమీ ఉండవు.

Review : Dora

సాంకేతిక విభాగం :

దినేశ్ కృష్ణ‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. హ‌రీశ్ ఉత్త‌మ‌న్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. సినిమాలో కాసింత రిలీఫ్ తంబిరామ‌య్య పాత్ర‌. పాట‌లు చెప్పుకోద‌గ్గ‌ట్టు పెద్ద‌గా ఏమీ లేవు. గ్రాఫిక్స్ ఫ‌ర్వాలేదు. వివేక్ మెర్విన్, సొలొమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాన్నించ్చింది. గోపి కృష్ణ ఎడిటింగ్ బాగున్నా ఫస్టాఫ్లో ఎక్కువైన కొన్ని అనవసరపు సీన్లను తొలగించి ఉంటే బాగుండేది. మల్కాపురం శివకుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు దాస్ రామసామి కాస్త వెరైటీగా ఉండే ప్లాట్ ను తీసుకుని దానికి మంచి కథనం అందివ్వడంలో ఫస్టాఫ్లో విఫలమైనా కూడా సెకండాఫ్లో విజయం సాధించాడు.

తీర్పు :

సినిమాలో స్టార్ ఉంటే ఆ సినిమా ప‌ట్ల క్రేజ్ అమాంతం పెరుగుతుంది. న‌య‌న‌తార లాంటి స్టార్ హీరోయిన్ ఓ సినిమాలో న‌టిస్తోందంటే సినిమా మీద ఆటోమేటిగ్గా ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. నయనతార నటన, ఎమోషనల్ సెకండాఫ్ ప్లస్ పాయింట్స్ కాగా విసుగుపుట్టించే ఫస్టాఫ్, హర్రర్ కంటెంట్ పూర్తిగా మిస్సవడం మైనస్ పాయింట్లు.      నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆమె కేరీర్లో ఒక చెప్పుకోదగినదిగా చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.  మొత్తంగా  ‘డోర’ భయపెట్టదు కానీ థ్రిల్ చేస్తుంది.

విడుదల తేదీ :  31/03/ 2017
రేటింగ్ : 2.75/5
నటీనటులు : నయనతార
సంగీతం : వివేక్ మెర్విన్, సొలొమన్
నిర్మాత : మల్కాపురం శివకుమార్
దర్శకత్వం : దాస్ రామసామి

- Advertisement -