​’గల్ఫ్’ లోగోను ఆవిష్కరించిన సుకుమార్ ​​

234
- Advertisement -

పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘గల్ఫ్’ అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లోగో ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

సుకుమార్: సునీల్ కుమార్ రెడ్డి నాకు ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ద్వారా పరిచయం. ఆ తర్వాత అయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘గంగపుత్రులు’ సినిమాను చూడడం జరిగింది. నేను ఒక రొమాంటిక్ క్రైమ్ కథ ను చూసి షాక్ అయ్యాను. ఆ సినిమా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇదే విషయం నేను గతంలో ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పడం జరిగింది. తెలుగు లో అసలు ఇలాంటి సినిమా ఒకటి తీసి హిట్ చేయొచ్చు అనేది చాలా కొత్త విషయం. తెలుగు లో వచ్చే అతి తక్కువ కొత్త కథల్లో ఆ సినిమా ఒకటి. అప్పటినుండి సునీల్ మీద నాకు అభిమానంపెరిగింది.

అయన రూపొందించే అన్నీ సినిమాలు చూడకపోయినా.. అయన ఏ సినిమా తీస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ సినిమాను హిందీలో తీస్తున్నారా లేదా అని ఆయనను అడిగాను.. ఒకవేళ ఆయన కనుక హిందీలో తెరకెక్కించకపోతే నేను ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నాను. ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే.. మేమందరం ఒక ఫ్లో లో..ఒరవడిలో కొట్టుకుపోతున్నాం. అయన అలా కాదు. సినిమాను ఎంజాయ్ చేసే వ్యక్తి. ఒక పాయింట్ తీసుకుని.. దాని మీద పూర్తిగా రీసెర్చ్ చేసి, క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆ తర్వాతే అయన సినిమాను తెరకెక్కిస్తారు. అదే రియల్ ఫిలిం మేకింగ్. అదే నిజమైన సంతృప్తినిచ్ఛే ప్రాసెస్.

Popular Director Sukumar unveils'Gulf' logo

అదేవిధంగా సునీల్ ఇపుడు గల్ఫ్ లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారు.. వారి జీవితాలపై రీసెర్చ్ చేసి ‘గల్ఫ్’ అనే సినిమాను రూపొందించారు. అందుకోసం గల్ఫ్ దేశాలకు వారిని కలిసి.. వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అంతే కాదు.. మా ఊర్లో 40% మంది ఉపాథి కోసం గల్ఫ్ బాట పట్టారు. వాళ్ళు తమ కుటుంబాలకు డబ్బు పంపడం.. కుటుంబాలకు అండగా నిలవడం ఇవన్నీ నేను దగ్గరనుండి చూశాను. మా ఇంటి చుట్టూ ఇలాంటివి 5 కుటుంబాలు ఉన్నాయి.

సునీల్ ఈవిధమైన కాన్సెప్ట్ తో చాలా మంచి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గల్ఫ్ లో ఉండేవారి జీవితాలపై ఈ సినిమాను తీశారు కాబట్టి వారందరూ ఈ సినిమాను ప్రమోట్ చేయాలని కూడా కోరుతున్నాను. పులగం చిన్నారాయణ నాకు చిరకాలమిత్రులు. అయన జర్నలిస్ట్ గా పనిచేస్తూ పుస్తకాలు రాస్తుంటారు. పుస్తకాలు రాసే వ్యక్తికి మాటలు రాయడం పెద్ద విషయం కాదు. నేను అదే విషయం ఆయనకు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు అయన ఈ సినిమాకు మాటల రచయిత. ఆయన ఉన్నత స్థానానికి ఎదగాలి .

Popular Director Sukumar unveils'Gulf' logo

‘గల్ఫ్’ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి : ఈ రోజు మా ‘గల్ఫ్’ సినిమా లోగో ను ఆవిష్కరించిన మిత్రుడు, శ్రేయోభిలాషి సుకుమార్ కి ధన్యవాదాలు. ‘గల్ఫ్’ షూటింగ్ పూర్తయింది. గల్ఫ్ జీవితానికి సంబంధించిన కంప్లీట్ రీసెర్చ్ బేస్డ్ సినిమా ఇది. ఒక అందమైన ఎంటర్టైనింగ్ లవ్ స్టోరీతో పాటు దాని చుట్టూ ఉండే సోషల్ ఇష్యూస్.. వాటికి వినోదాన్ని మేళవించి ఒక అవేర్ నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇది. అతి త్వరలో మీముందుకు రాబోతోంది.

‘గల్ఫ్’ నిర్మాత రవీంద్ర బాబు : ఈ రోజు మా శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా లోగో ను ఆవిష్కరించిన డైరెక్టర్ సుకుమార్ కి కృతఙ్ఞతలు. దర్శకుడు సునీల్ తో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ కు ఇది 14 వ సినిమా. గల్ఫ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగుంది. గల్ఫ్ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

‘గల్ఫ్’ మాటల రచయిత పులగం చిన్నారాయణ: సునీల్ కుమార్ రెడ్డి తో ఈ సినిమా ప్రయాణం ఒక విచిత్రమైన అనుభవం. అయన ఒక డైరెక్టర్ గా.. నేనొక డైలాగ్ రైటర్ అన్నట్టుగా కాకుండా ఇద్దరు జర్నలిస్టులు చేసిన ఒక సిన్సియర్ ప్రయత్నం ఈ ‘గల్ఫ్’ సినిమా. ఆంధ్ర, తెలంగాణ ల నుండి గల్ఫ్ కు వలస వెళ్లిన యువతీ యువకుల జీవితాల్లోని చీకటిని, తడిని, ప్రేమని.. చాలా స్వచ్ఛంగా నగ్నంగా ఆవిష్కరించే సినిమా ఇది. గల్ఫ్ ఖఛ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఇది ఆర్ట్ ఫిలిం లాంటిది కాదు..హార్ట్ ఫిలిం. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పించిన సునీల్ కుమార్ రెడ్డికి కృతఙ్ఞతలు.

- Advertisement -