రివ్యూ : ధృవ

228

మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ధృవ’ .తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌స్వామి, నవదీప్‌ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నా ‘ధృవ’ ఇవాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్,ట్రైలర్,టీజర్‌తో ధృవపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రజల తలరాతల్ని నిర్ణయించేది ఓ రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుడి తల రాతల్ని నిర్ణయించేది ఓ బిజినెస్‌ మాన్‌’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరలైంది. ఇక మెగా అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధృవతో రాంచరణ్ ఆకట్టుకున్నాడో లేదో చూద్దాం…

Review : Dhruva

కథ :

ధృవ (రామ్‌చరణ్‌) ఓ యంగ్ పోలీస్ ఆపీసర్. ఎవరిని కొడితే వందమంది క్రిమినల్స్‌ అంతం అవుతారో అతడినే తన లక్ష్యంగా చేసుకొంటాడు. ఆ లక్ష్యం చేరుకొనే క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆ ప్రయాణంలో ఎదురైన సైంటిస్ట్ సిద్ధార్థ్‌ అభిమన్యు (అరవింద్‌ స్వామి)తో గొడవ జరుగుతుంది. సిద్ధార్ధ్ అభిమన్యు  బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ? అతనికి, ధృవకి మధ్య ఫైట్ ఎందుకు మొదలైంది ? అది ఎలా సాగింది ? ఆ ఫైట్ లో చివరికి ఎవరు, ఎలా గెలిచారు ? అన్నది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథాంశం, స్క్రీన్ ప్లే, రాంచరణ్ నటన. సినిమా కోసం రామ్ చరణ్ తన శరీరంలో తీసుకువచ్చిన మార్పులు అబ్బురపరుస్తాయి. ఓ స్ట్రాంగ్ పోలీస్ అదికారిగా చేసుకున్న మేకోవర్ సూపర్బ్ అనిపిస్తుంది. చరణ్ కష్టం తెరపై కొట్టొచ్చినట్లు కనబడుతుంది. హీరో-విలన్‌ల మధ్యన ఇలా జరిగే మైండ్‌గేమ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నిచ్చింది. రామ్ చరణ్ ధృవ అనే పోలీసాఫీసర్ పాత్రలో చాలా బాగా నటించాడు.

సిద్ధార్థ్ అభిమన్యుగా అరవింద్ స్వామి తనపాత్రకు ప్రాణం పోశాడు. ఈ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం అన్నట్టుగా నటించాడు. రకుల్ ప్రీత్ సినిమాకు మరో అట్రాక్షన్‌. పరేషానురా అన్న పాటతో ప్రేక్షకులను పరేశాన్ చేసేసింది. కథలోని అసలైన ఎలిమెంట్‌ను చివరివరకూ థ్రిల్లింగ్‌గా నడపడం మరో హైలైట్.

Review : Dhruva

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్,సెకండాఫ్‌లలో కొద్ది చోట్ల కథనం నెమ్మదిగా సాగినట్లనిపిస్తుంది. రెండున్నర గంటలకు పైనే ఉన్న రన్‌టైమ్ కూడా కాస్త ఇబ్బందే. రామ్ చరణ్, రకుల్ మధ్య రొమాంటిక్ సీన్స్ పండలేదు. మొదటి నుంచి ఇంటర్వెల్ దాకా సీరియస్ మోడ్ లో నడిచింది. కేవలం అరవింద్ స్వామి సీన్స్ మాత్రమే ఫస్టాఫ్ ని పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇక కథలో అక్కడక్కడా వచ్చే కొన్ని లాజిక్స్ సరైనవే అయినా సామాన్య ప్రేక్షకులకి అంత త్వరగా అర్థంకావు.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు సురేందర్ రెడ్డి విషయానికి వస్తే, తమిళంలో ఘన విజయం సాధించిన కథను, పెద్దగా మార్పులేవీ చేయకుండా, ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టుగా సన్నివేశాలను మార్చుకొని రాసిన స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. మేకింగ్ పరంగా సురేందర్ రెడ్డి ఎప్పట్లానే తన బ్రాండ్‌ను మరొకసారి చాటుకున్నారు. పీ.ఎస్.వినోద్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. హిపాప్ థమిజా అందించిన పాటలు ఫర్వాలేదనేలానే ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంది. ఎడిటింగ్ బాగుంది. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయానికి వస్తే … హై స్టాండర్డ్స్ లో ఉన్నాయి.

Review : Dhruva

తీర్పు :

వరుసగా రెండు సినిమాలు ప్లాప్‌ల తర్వాత రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ధృవ. సినిమా కథ,అరవింద స్వామి, రామ్ చరణ్ ల నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ ప్లస్ పాయింట్స్ కాగా, నెమ్మదించిన సెకండాఫ్ కథనం,అర్ధం కాని లాజిక్స్,రన్ టైం మైనస్ పాయింట్స్. మొత్తం మీద మగధీర తర్వాత చెర్రీ ధృవతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి.

విడుదల తేదీ : 9/12/ 2016
రేటింగ్ : 3.5/5
నటీనటులు : రామ్ చరణ్,రకుల్ ప్రీత్,అరవింద్ స్వామి
సంగీతం : హిపాప్ తమిజా
నిర్మాత : అల్లు అరవింద్, ఎన్.వీ.ప్రసాద్
దర్శకత్వం : సురేందర్ రెడ్డి