రివ్యూ :​ చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే

276
Review Chinni Chinni Asalu Nalo Regene
- Advertisement -

ప‌వ‌న్, గ‌ట్టు మ‌ను, సోనియా హీరో , హీరోయిన్ల‌గా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్‌ చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`. సంతోష్ నేలంటి ద‌ర్శ‌క‌త్వంలో  పి.ఆర్. మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై గ‌ట్టు వెంక‌న్న‌, ప‌వ‌న్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ర్యాప్ రాక్ ష‌కీల్ అందించిన ఈ పాటలు విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుందా లేదా చూద్దాం..

Review Chinni Chinni Asalu Nalo Regene

కథ :

ఇప్పుడంతా ప్రేమికుల యుగం. దాదాపు 90 శాతం యూత్ జంట‌ల‌గానే ఉన్నారు. అలా ఓ కుర్రాడు సంతోష్ (పవన్) ప్రియురాలి కోసం ప్ర‌య‌త్నించి చివ‌రికి అమ్మాయి దొర‌క‌క నిరూత్సాహ ప‌డుతోన్న స‌మ‌యంలో ఓ సిమ్ కార్డు ఆ కుర్రాడి జీవితాన్నే మార్చేస్తుంది. ల‌వ‌ర్ లేద‌నుకుంటోన్న ఆ జీవితంలో వెలుగులు నింపే ఓ ప్రేయ‌సి నిత్య (సోనియా దీప్తి)  గుండె త‌లుపులు త‌డుతుంది? . మొదటి కలయికలోనే ఆమెను ప్రేమిస్తాడు. నిత్య కూడా తనతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కలిసిన వ్యక్తి ఒక్కరే అనుకుని అతన్ని ప్రేమిస్తుంది.అలా సంతోష్ ప్రేమలో ఉండగానే అతను ఎవరి పేరుతో అయితే మోసం చేస్తున్నాడో ఆ పేరు గల అసలు వ్యక్తి ఎవరనేది తెలుస్తుంది. ఆ అసలు వ్యక్తి ఎవరు ? అతను బయటికి రావడంతో సంతోష్ కు ఎలాంటి ఇబ్బందులొచ్చాయి ?  చివరికి సంతోష్ ప్రేమ సక్సెస్ అయిందా అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఇద్దరు వ్యక్తులు చిన్న పొరపాటు వలన ఎలా ప్రేమికులవుతారు అనే అంశాన్ని సినిమాగా చేయాలనుకున్న దర్శకుడి ఆలోచన బాగుంది. సెకండాఫ్ రివీల్ అయ్యే సమయంలో నిత్య ప్రేమించిన వ్యక్తి ఎంటరవ్వడం,అలాగే సంతోష్ మోసం చేసి ప్రేమించిన నిత్య వెనకున్న అసలు నిజం ఏమిటనేది కూడా ఆసక్తికరంగా అనిపించింది.హీరోయిన్ పాత్రలో చేసిన సోనీ దీప్తి పెర్ఫార్మెన్స్ సినిమాలో చెప్పుకోదగ్గ మరో అంశం.  జబర్దస్త్ అప్పారావ్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ రొటిన్ లవ్ స్టోరి. హీరోగా పవన్‌ అంతగా మెప్పించలేదు. హావభావాలు, మాటలు ఇలా దేనిలోనూ పర్ఫెక్షన్‌ చూపించలేదు. ప్రేమ కథను డిఫరెంట్ గా తీద్దామనుకున్న దర్శకుని ఆలోచన బాగుంది కానీ చేసిన ప్రయత్నమే మరీ దారుణంగా ఉంది. తరచూ కనిపించే హీరో ఫ్రెండ్స్ సన్నివేశాలు విసుగెత్తించాయి. మధ్యలో ఎందుకొస్తున్నాయో కూడా తెలీని తాగుబోతు రమేష్ ఎపిసోడ్, షకలక శంకర్ ట్రాక్ లు తలపట్టుకునేలా చేశాయి.

సాంకేతిక విభాగం :

టెక్నికల్‌గా సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ అడ్డదిడ్డంగా ఉంది. ఏ ఫ్రేమ్ ఎవర్ని టార్గెట్ చేస్తుందో అస్సలు అర్థం కాలేదు. ఇక రాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఏమాత్రం ఆకట్టుకోకపోగా పాటలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనిపించింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి.

Review Chinni Chinni Asalu Nalo Regene

తీర్పు:

ఇంటర్వెల్ ట్విస్ట్, హీరోయిన్ సోనియా దీప్తి పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్‌  కాగా  నటీనటుల నటన, విసిగించే ఫస్టాఫ్,  కథనాలు, బలవంతపు సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్స్. ప్రేమ కథలన్నీ రొటీన్ కథలే అయినా స్క్రీన్ ప్లే, టేకింగ్ లో కాస్తైనా కొత్తదనముంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ ఈ సినిమాలో అలాంటివి ఏమీ లేకపోవడంతో ఇదో బోరింగ్ రోటీన్ సినిమా.

విడుదల తేదీ : 07/04/2017
రేటింగ్ : 2/5
నటీనటులు : పవన్, సోనియా దీప్తి
సంగీతం : రాప్ రాక్ షకీల్
నిర్మాత : రజిని గట్టు
దర్శకత్వం : సంతోష్ నేలంటి

- Advertisement -