టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీభవన్‌ను అమ్మేస్తారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. జూబ్లీహిల్స్ టికెట్‌ను ఆశీంచిన విష్ణుకు నిరాశే మిగిలింది. దీంతో నిన్న సీఎం కేసీఆర్‌ని కలిశారు. ఇక ఇవాళ మంత్రి హరీష్ రావు…విష్ణు ఇంటికి వెళ్లి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించగా సముఖత వ్యక్తం చేశారు. విష్ణుకి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని…తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన ఏకైక ఎమ్మెల్యే విష్ణు అన్నారు. పీజేఆర్ అంటే కాంగ్రెస్…కాంగ్రెస్ అంటే పీజేఆర్ కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదన్నారు.
త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరుతానని స్పష్టం చేశారు విష్ణు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌ను అమ్మేస్తారని…పై స్థాయిలో ఉన్నవాళ్లు అమ్ముడుపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తారని మండిపడ్డారు. తనను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించిన కేసీఆర్, కేటీఆర్, కవితలకు కృతజ్ఞతలు తెలిపారు. పీజేఆర్ అంటే హైదరాబాద్ అని, ప్రజలకు ఆయన గురించి బాగా తెలుసన్నారు.
ఖైరతాబాద్ నుంచి విష్ణు సోదరి విజయ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో విష్ణుని ప్రచారానికి వినియోగించుకోనున్నారు.
Also Read:కాంగ్రెస్ అక్కడ ప్లాప్.. బిఆర్‌ఎస్ ఇక్కడ గ్రేట్!