రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి..

125
revanth
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు జగ్గారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జరిగిన సీఎల్పీ భేటీలో రేవంత్‌పై గరం అయ్యారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ వ్యవహార శైలిపై పార్టీ ముఖ్య నేతల దగ్గర తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది పార్టీనా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అని మండిపడ్డారు జగ్గారెడ్డి.

జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ కోసం వస్తున్నట్లు… తనకు కనీసం పీసీసీ నుంచి సమాచారం రాలేదన్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే కాంగ్రెస్ పార్టీలో కుదరదని… జహీరాబాద్ కు వస్తే కనీసం సీనియర్ నేత గీతారెడ్డికి సమాచారం ఇవ్వలేదన్నారు. సంగారెడ్డికి వస్తే… తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. తనకు…రేవంత్ కి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేందుకే రేవంత్ రెడ్డి.. ఇలా సమాచారం ఇవ్వడం లేదా అని పార్టీ ముఖ్యనేతలతో జగ్గారెడ్డి అన్నారు.

పార్టీ కమిటీలలో డిస్కషన్ చేయకుండా ముందే ప్రోగ్రాంలు ఫిక్స్ చేస్తున్నారని..కాంగ్రెస్ లో అందరూ ఒకటేనని…ఒక్కరే స్టార్ అనుకుంటే కుదరదని చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రేవంత్…సమావేశానికి హాజరుకాలేదట. మొత్తంగా జగ్గారెడ్డి వ్యవహారం పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -