అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు..

77
pocharam

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

అంతకముందు ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశాలు ప్రారంభం కాగా, స‌భ‌లో స్పీక‌ర్ సంతాప తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం స‌భ‌ను వాయిదా వేశారు. స‌భ వాయిదా వేసిన త‌రువాత బీఏసీ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో స‌భ‌లో చ‌ర్చించే అంశాల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు.