టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీపై ఉండే ప్రేమను బయట పెడుతూ వచ్చారు. టీడీపీ తనను రాజకీయ నేతగా గుర్తించిందని, చంద్రబాబు తనకు రాజకీయ గురువని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోని చాలామంది కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డిని వలస దారుడిగానే చూస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంచితే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డిని చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నారా ? రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు మధ్య డీల్ కారణంగానే టీడీపీ ఎన్నికల్లో పోటీని విరమించుకుందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మద్య కాంగ్రెస్ జరుగుతున్న బహిరంగ సభలలో టీడీపీ జెండాలు దర్శనమిస్తున్నాయి. అలాగే టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
దీన్ని బట్టే టీడీపీ కాంగ్రెస్ మధ్య అంతర్గత ఒప్పందాలు ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు పట్ల రాష్ట్ర ప్రజలు పూర్తి వ్యతిరేకంతో ఉన్నారు. అందుకే రాష్ట్రంలో బలపడేందుకు దొడ్డిదారిలో టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కై నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో అధికారం కూడా చంద్రబాబు కనుసైగల్లో జరిగేలా రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు మద్య డిల్ కుదిరినట్లు టాక్. ప్రస్తుతం కాంగ్రెస్ లో పాలనపరమైన నాయకుల కొరత తీవ్రంగా ఉంది. అధికారంలోకి వస్తే శాఖలపై ఏ నాయకుడికి సరైన అవగాహన లేదు. అందుకే రేవంత్ రెడ్డి చంద్రబాబు ద్వారా అధికారాన్ని నడిపించే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టినట్లేనని రాజకీయ అతివాదులు హెచ్చరిస్తున్నారు.
Also Read:స్కాంగ్రెస్.. ‘డమ్మీ సర్వేల’ బాగోతం!