CM Revanth:రేవంత్ అనే నేను

57
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశారు.

1969లో మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించారు రేవంత్. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ చదివారు. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో చేరారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు.

2007లో మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009,2014లో కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగ గెలిచారు.2018లో ఓటమి పాలు కాగా తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

Also Read:స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్

- Advertisement -