సీఎం రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నారని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ప్రధానమంత్రి మోడీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనేనన్నారు. త్వరలోనే తన బృందంతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్నారు. నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షా లకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు..
నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను… అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి? అని డిమాండ్ చేశారు. ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు.
Also Read:దసరా నుండి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం