అమ్మో ‘కొడంగల్ ‘..రేవంత్ రెడ్డి భయం!

48
- Advertisement -

తెలంగాణ దంగల్ కు మరో మూడు రోజులే మిగిలి ఉండటంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పై పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాప్పటికి ఆ పార్టీని ఓటమి భయం గట్టిగానే వెంటాడుతోంది. ముఖ్యంగా పార్టీలోని కీలక నేతలను ఈ భయం మరింతగా వేధిస్తోంది. ఈ మధ్య హస్తనిదే విజయం అని తెగ హడావిడి చేస్తున్న రేవంత్ రెడ్డి.. పార్టీ గెలుపు సంగతి అలా ఉంచితే ఆయన గెలవడమే కష్టమనే సంకేతాలు కనిపిస్తునాయి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన రేవంత్ రెడ్డికి ఈసారి కూడా అదే పరాభవం తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. కొడంగల్ తో పాటు ఈసారి కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ఆయన ఓటమి చవిచూసిన పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే కామారెడ్డిలో కే‌సి‌ఆర్ పోటీలో ఉన్నారు. .

కే‌సి‌ఆర్ ను దాటుకొని విజయం సాధించడం దాదాపు అసాధ్యమే. ఇప్పుడు కొడంగల్ లో కూడా అదే భయం రేవంత్ రెడ్డిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పై పైచేయి సాధించిన పట్నం నరేందర్ రెడ్డి పట్ల నియోజకవర్గ ప్రజలు సానుకూలంగా ఉన్నారు. దానికి తోడు కాంగ్రెస్ అధిష్టానానికి తలవంచే రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే గతంలో కంటే కూడా రేవంత్ రెడ్డి ఇమేజ్ నియోజక వర్గంలో మరింత తగ్గిందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం కోడంగల్ లో గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల కంటే కొడంగల్ లోనే ఎక్కువ ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కొడంగల్ ప్రజలు ఈసారి రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తే ఆయన ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం గా మారే అవకాశం ఉంది.

Also Read:నటుడు నరేష్‌కు అరుదైన గౌరవం

- Advertisement -