CM KCR:వేములవాడలో ఎగిరేది గులాబీ జెండానే

46
- Advertisement -

వేములవాడలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు సీఎం కేసీఆర్. వేములవాడ ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన సీఎం…బీఆర్ఎస్ అభ్యర్థి చల్మాడ లక్ష్మీనరసింహరావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని..ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని..దానిని ఖచ్చితంగా మంచి చేసే వారికోసమే ఉపయోగించాలన్నారు.

వేములవాడ పట్టణానికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ గడ్డకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే జీవితంలో ప్రధాన ఘట్టమైన నా పెండ్లి ఇదే ఆలయంలో జరిగిందన్నారు.

ఇక్కడ నిజాయితీ పరుడైన చెన్నమనేని రమేశ్‌ ఎమ్మెల్యేగా ఉండె. ఆయనను మార్చాల్సిన అవసరం లేకుండె. కానీ కోర్టులో దిక్కుమాలిన కేసుతో తేపతేపకు గడబిడ గడబిడగా ఉంటుంది. మళ్లా పరేషాన్‌ ఎందుకని, ఆయనను అంతకన్నా ఉన్నత పదవిలో పెట్టుకుందామని చల్మెడ లక్ష్మినరసింహారావుగారిని ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలబెట్టినం అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రూ.200 ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 చేసినం. తర్వాత దాన్ని రూ.2 వేలు చేసుకున్నం. ఈసారి గెలిచినంక రూ.5 వేలు చేస్తానని చెప్పారు.

Also Read:చలికాలంలో ఈ జాగ్రత్తలు..తప్పనిసరి!

- Advertisement -