ముడిమ్యాల నుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర..

31

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం నిత్యవసర ధరల పెరుగుల, సామాన్యుడిపై భారాన్ని నిరసిస్తూ చేవేళ్ల మండలం ముడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముడిమ్యాలలోని అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి పాదయాత్రగా బయలుదేరారు.

పాదయాత్రకు ముందు ఆయన చిలుకూరు బాలజీని దర్శించుకున్నారు. అనంతరం మొయినాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశారు రేవంత్ రెడ్డి. ఈ పాదయాత్రకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంఘీభావం తెలపడానికి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు చేవేళ్ల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించానున్నారు.