టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌కు రాహుల్ గాంధీ స్వీట్ తినిపించారు. ఈ ఫొటోను రేవంత్ రెడ్డి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ తినిపించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఎడమ చేత్తో స్వీట్ పెట్టాడంటే, మీకు(రేవంత్‌కు) హ్యాండ్ ఇచ్చినట్టే కామెంట్ పోస్ట్ చేయగా… ఎడమ చేత్తో స్వీట్ పెడుతున్నాడంటే అది విషంతో సమానమని, మిమ్మల్ని రాహుల్ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదని మరొకరు కామెంట్ చేశారు.
కష్టపడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు.. రాహుల్ గాంధీ ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అంటూ ఒక నెటిజన్ స్పందించాడు. టీడీపీని వదిలిన దెయ్యం… కాంగ్రెస్‌ను పట్టుకుందంటూ ఎల్ రమణ చేసిన వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నారు. మొత్తంగా రేవంత్, రాహుల్ గాంధీ ఫోటో ఇప్పుడు నెటిజన్ల చేతిలో బంతిలాగా మారింది.