రేవంత్‌ పాలనలో స్కీములు లేవు..స్కాంలే!

1
- Advertisement -

కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని అన్నాడు… రేవంత్ రెడ్డి ఏమో కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.గతంలో కేసీఆర్ 17 వేల ఖాళీలు ఉంటే 17 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు.. మరి రేవంత్ రెడ్డి ఎందుకు 5 వేల ఉద్యోగాలే నింపుతున్నాడు?.. ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు.. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు అన్నారు.

రేవంత్ పాలనలో స్కీములు లేవు..అన్నీ స్కాములే.. సివిల్ సప్లైస్ నుండి సింగరేణి వరకు అన్ని డిపార్ట్‌మెంట్లలో స్కాములే అని ఆరోపించారు హరీష్‌.ఆఖరికి పిల్లలకు పెట్టే కోడిగుడ్లు, పప్పు, ఉప్పును వదలని పాపపు కాంగ్రెస్గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ..పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా? చెప్పాలని ప్రశ్నించారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ విసురుతున్నారు.. మేము కొన్నదే రూ.650 కోట్లకు కొంటే రూ.2000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నారు.. మీ డిపార్టుమెంట్లో మంత్రులుగా ఉండి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు అన్నారు.

యూనిఫాంలు, టైల కోసం రూ. 1200 కోట్ల టెండర్ పిలిస్తే, ఉప్పులు, పప్పులు, చికెన్ కోసం రూ.800 కోట్ల టెండర్ పిలిచారు.. రెండు కలిపితే రూ.2000 కోట్లు …టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే మీరు ఏం పాలన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నారు. ఎంత కొన్నారో, ఎంత టెండర్లు పిలిచారు తెలియలేదు అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను … ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి ఆ అనుముల అన్నా తమ్ముళ్లు మొత్తం మింగుతున్నారు.. అందుకే మీకు ఏమీ తెలియదు అన్నారు.

కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు.. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు కానీ అనుముల వారి నలుగురు అన్నా తమ్ముళ్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారు అని చెప్పుకొచ్చారు.

ALso Read:CBN @361 డిగ్రీస్

- Advertisement -